గౌర ఆరతి

(శ్రీల భక్తివినోద ఠాకూఆరు రచించిన 'గీతావళీ' నుండి)


(1) (కీబ) జయ జయ గోరాచాందేర్ ఆరతికో శోభా
      జాహ్నవీతటవనే జగమనలోభా

      జగజనమనలోభా

(2) దఖిణె నితాయ్ చాంద్, బామే గదాధర
      నికటే అద్వైత, శ్రీ నివాస ఛత్రధర

(3) బోసియాఛే గోరాచాంద రత్నసింహాసనే
    ఆరతి కోరెన్ బ్రహ్మా ఆది దేవగణే

(4) నరహరి ఆది కోరి ‘ చామర ధులాయ
      సంజయ ముకుంద బాసుఘోషాది గాయ

(5) శంఖ బాజే ఘంటా బాజే బాజే కరతాల
      మధుర మృదంగ బాజే పరమ రసాల

(6) బహు కోటి చంద్ర జిని' వదన ఉజ్జ్వల
      గల దేశే బనమాలా కోరె ఝలమల

(7) శివశుకనారద ప్రేమే గదగద
      భకతివినోద దేఖే గోరార సంపద


(1) మనోహరమైన శ్రీ చైతన్య మహాప్రభువు ఆరతి శోభకు జయము జయము. ఈ గౌర ఆరతి జాహ్నవి (గంగా) నది తీరములో గల వనములో జరుగుతూ విశ్వములోని అన్ని జీవరాశుల హృదయాలను ఆకట్టుకొనుచున్నది.

(2)  శ్రీ చైతన్య మహాప్రభువు కుడివైపున శ్రీ నిత్యానంద ప్రభువు మరియు ఎడమ వైపున శ్రీ గదాధరుడు ఉన్నాడు. దగ్గరలో శ్రీ అద్వైత ప్రభువు నిలబడి ఉన్నాడు మరియు శ్రీనివాస ఠాకూరు  శ్రీ చైతన్య మహాప్రభువునకు గొడుగు పట్టుకొని ఉన్నాడు.

(3)  శ్రీ చైతన్య మహాప్రభువు రత్నపు సింహాసనముపై ఆసీనులైనారు, బ్రహ్మతో మొదలుకొని దేవతలందరు ఆయనకు ఆరతి చేస్తున్నారు.

(4) నరహరి సర్కారు మరియు  శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఇతర అనునాయులు ఆయనకు చామరములు వీస్తున్నారు. సంజయ పండిత, ముకుందదత్త, వాసుఘోష  మరియు ఇతర భక్తులు మధురమైన గీతములను పాడుతున్నారు.

(5) శంఖములు, గంటలు మరియు కరతాళ ద్వానులు మార్మోగుచున్నాయి. మృదంగాలు మధురముగా మ్రోగసాగాయి. ఈ కీర్తన యొక్క సంగీతము అత్యంత మధురముగాను, చెవికింపుగాను ఉన్నది.

(6)  శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఉజ్జ్వల వదనము కోట్లకొలది చంద్రులను సైతం అతిశయింప చేసినది. వారి మెడలో అటవీ పుష్పాలతో చేసినటువంటి పులామాల కాంతులీనుచున్నది.

(7) శివుడు, శ్రీ శుకదేవ గోస్వామి మరియు నారదముని అందరూ అక్కడ ఉన్నారు. దివ్యా ప్రేమపారవశ్యము వలన వారి గొంతులు గద్గదమైనాయి. ఆ విధముగ శ్రీల భక్తివినోద ఠాకూరు  శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అపూర్వ వైభవాన్ని దర్శిస్తున్నారు.