శ్రీ  నరసింహ ప్రణామము


(1) నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే 

    హిరణ్యకశిపోర్వక్షహః శిలాటంకనఖాలయే


(2) ఇతో నరసింహః పరతో నరసింహా    

    యతో యతో యామి తతో నరసింహః 

    బాహిర్ నరసింహో హృదయే నరసింహో   

    నరసింహమాదిం శరణం ప్రపద్యే


(1) ప్రహ్లాదునికి ఆనందమును కలిగించునటు వంటివాడు, మరియు దైత్యరాజైన హిరణ్యకశిపుని కఠిన ఛాతిని శీలముల వంటి తన చేతి గోరులతో చీల్చి నటువంటి వాడైన ఆ నృసింహ భగవానునికి నా ప్రణామములు.


(2) ఆ నృసింహ భగవానుదూ ఇచ్చట కలడు మరియు అచ్చట కూడా కలడు. నేనెచటకు వెడలినను అచ్చట కూడా నృసింహ భగవానుడు కలడు. భగవంతుడు నా హృదయము నందునా కలడు మరియు బయట కూడా కలడు. సమస్తమునకు మూలము మరియు పరమాశ్రయమైన ఆ నృసింహ భగవానునికి నా ప్రణామములు.

 నరసింహ ప్రార్థన

('దశావతార స్తోత్రము' శ్రీ జయదేవ గోస్వామి విరచితము)


 తవ కరకమలవరే నఖమద్భుతసృంగం 

 దలితహిరణ్యకశిపుతనుభృంగమ్

 కేశవ ధృతనరహరిరూప జయ జగదీశ హరే!


     నరహరి రూపాన్ని ధరించిన ఓ కేశవా! ఓ జగదీశా! ఓ హరే! నీకు జయము జయము. ఏ విధముగానైతే మనము సునాయాసముగా కందిరీగను నులిమి వేస్తామో, నీవు కందిరీగలాంటి దైత్యుడైన హిరణ్యకశిపు శరీరమును నీ సుందరమైన కమలముల వంటి కరములకు కలిగిన అద్భుతమైన గోళ్ళతో చీల్చివేసావు.